రాజంపేట ( జనస్వరం ) : రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ వైయస్సార్ పంట బీమా కార్యక్రమంలో CBI దత్తపుత్రుడు మాట్లాడుతూ రైతుల కోసం తమ ప్రభుత్వం ఎంతో చేస్తుందని చెప్తున్నారు. గడప గడపకి జగన్ ప్రభుత్వం అని ఆ తర్వాత, బస్సు యాత్ర అని అవన్నీ తుస్సుమన్న డంతో ప్రజలను ఎదుర్కొనే దమ్ము లేక ఏదో ఒక కార్యక్రమం పేరుతో పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అర్హత లేదు అంటూ విమర్శిస్తున్నారు. ఒక రూపాయి ముఖ్యమంత్రికి అక్రమాస్తుల కేసులో ఎప్పుడు బైల్ రద్దు అవుతుందో తెలియక ప్రతి శుక్రవారం కోర్టుల చుట్టూ తిరుగుతూ ప్రభుత్వం ప్రభుత్వం తప్పిదాలను ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెడుతూ అరాచక పాలన చేస్తున్న జగన్ కు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా ?? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున సూటిగా కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నామన్నారు.
1. గతంలో విత్తనాల ధర, ఎరువుల ధర, ప్రస్తుతం వైసీపీ అధికారం లో వచ్చాక వాటి ధరల వ్యత్యాసం అయినా తెలుసా ?
2. రైతుల మీద ప్రేమ అని చెప్పే ప్రభుత్వం పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పగలరా ? పోలవరం ఈ నాటికి పూర్తి అయి ఉంటే ప్రతి సంవత్సరం రాష్ట్రంలో వేల కోట్ల ఆదాయాన్ని అందించే పంటలకు నీటిని అందించే అవకాశం ఉండేది? అలాకాక రివర్స్ టెండరింగ్ పేరుతో రైతుల పొట్ట కొట్టారు.
3. పండిన పంటకు గిట్టుబాటు ధరలు అందడం లేదు. రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు ఆలస్యం చేయడంతో రైతు భరోసా కేంద్రాలలో సగానికి సగం దొరకి రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితిని తీసుకువచ్చి రైతులు నష్టపోయే చేసే ప్రభుత్వం వైఎస్సార్ ప్రభుత్వం కాదా ?
4. వేలాది మంది కౌలు రైతులు ప్రతి సంవత్సరం ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కనీసం వారి కుటుంబానికి అండగా ఉండకపోగా సామాన్య మండల కింద చిత్రీకరించి వారిని అవమానించింది ఈ ప్రభుత్వం కాదా ?
5. అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా నష్టపోయిన రైతులకు ఇచ్చిన వాగ్ధానాన్ని నెరవెర్చకుండా వరదల్లో వచ్చిన ఇసుకను రైతుల పొలాల లో నుంచి తీయడానికి కనీసం ఎలాంటి ప్రయత్నాలు కూడా వైసీపీ ప్రభుత్వం చేయడం లేదు. ఇదేనా వైసీపీ ప్రభుత్వానికి రైతుల మీద ఉన్న ప్రేమ ? అని ప్రశ్నించారు. ఇపుడు ప్రభుత్వం రైతుల కోసం పంట బీమా తీసుకొస్తున్నామని చెప్తే ఆంధ్రప్రదేశ్ రైతులు అమాయకులు కారన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు బాల సాయి కృష్ణ, కడప జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కత్తి సుబ్బరాయుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు భాస్కర్ పంతులు , క్రియాశీలక కార్యకర్తలు హరి నంద్యాల, పోలిశెట్టి శ్రీనివాసులు, చంగల్ రాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com