Logo
Date of Publish : 25 April 2022, 2:44 pm
Editor : Sake Naresh

వ్యవసాయ శాఖ మంత్రి కాకాని… వ్యవసాయం చేసేవారి ఇబ్బందులు మీకు తెలుసా…?

           నెల్లూరు ( జనస్వరం ) : జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ చెన్నారెడ్డి గారి నాయకత్వంలో జిల్లా నాయకులు కిషోర్ గునుకుల, దుగ్గిశెట్టి సుజయ్ బాబు  తదితర నాయకులు జిల్లా కార్యలయం విలేకరుల సమావేశంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు ఒత్తిడులు తట్టుకోలేక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మిత్రపక్షాలతో కలిసి రాష్ట్ర అధికారం సాధిస్తామని భయంతో కొత్తగా వచ్చిన మంత్రులు నోరు పారేసుకుంటున్నారు.. పుట్టికి 850 కేజీలు అని, ఆ పుట్టుక 16600 మద్దతు ధర కల్పించాలని జ్ఞానం ఉన్నదా అని అన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి పుట్టు అంటే 1050 కేజీలగా లెక్కగట్టి రూ16,600 ఇస్తున్నారని అన్నారు. 850 కేజీల పుట్టు కి 16600 గిట్టుబాటు ధర కల్పించడంలో మీరు విఫలమవుతున్నారని తెలియదా ?  గుండెల మీద చేయి వేసుకుని చెప్పండన్నారు. భూగర్భ జలాలు మీ కార్యకర్తలు కనుసన్నుల్లో గురవుతున్నాయని తెలుసా ? భూగర్భ జలాల అందక పక్కవారికి పొలాల్లో పైరు వేయలేని పరిస్థితి ఉందన్నారు. థర్మల్ ప్లాంట్ కాలుష్యానికి చుట్టుపక్కల రైతులు మాడి మసై పోతున్నారన్నారు. మీ నియోజకవర్గం కాలుష్య కోరల్లో ఇరుక్కుని జిల్లావ్యాప్తంగా జబ్బులు బారిన పడుతున్నారన్నారు. అడ్డగోలుగా పోర్టులో అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తూ దొరికిన చోటల్లా మైనింగ్ దోపిడికి గురి చేస్తూ తెలివిలేని మాటలు మాట్లాడకండన్నారు. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమై కోట్ల రూపాయల సంపాదనలో మునిగి సహజ సిద్ధంగా ఏర్పడిన పోర్టు అభివృద్ధి తుంగలోకి తొక్కిందన్నారు. 10 సంవత్సరాల కిందట కృత్రిమంగా పెద్ద బెర్త్ కలిగి ఉన్నా ఇప్పటికీ అంతర్జాతీయ ప్రమాణాలలో సౌకర్యాలు ఏర్పాటు చేయడం విఫలం అయ్యారన్నారు. ఎవరికీ ఏ ఆపద వచ్చినా వెంటనే పదవులలో ఉండి మీరు చేయాల్సిన పని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నారన్నారు. వ్యవసాయదారులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైన మీరు ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు తన సంపాదనలో నుంచి డబ్బులు డబ్బులు తీసి ఇస్తున్నాడని ఓర్వలేక ఎక్కడ ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందని నీకు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. మీకు ఉన్న భూములు మీరు సొంతంగా ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు, కౌలుదారులకిచ్చిన మీరు వారి ఇబ్బందులు పట్టించుకున్నారా అని అన్నారు. జిల్లాలోని ఒక నియోజకవర్గంలో సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మీరు కక్షసాధింపు చేస్తే కక్షసాధింపు చర్యలకు అందరికీ తెలిసినదే. రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసే పరిస్థితి లేదు మంత్రి పదవి ఇచ్చిన ప్రతి ఒక్కరూ వేషాలు వేస్తున్నారు ఇలాంటి వారికి అందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి లేదని అన్నారు. దళారుల చేతుల్లో ధగా పడుతున్న రైతులను కాపాడే ప్రయత్నం చేయండి అంతేగాని టైం పాస్ మాటలు టైం పాస్ వ్యవహారాలు నడిపించకండన్నారు. అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని ప్రగల్భాలు పలకడం కాదు, గడిచిన మూడు సంవత్సరాల్లో మూడు వేల మంది రైతులు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు అంటే 30 కోట్ల రూపాయలు జనసేన పార్టీ తరఫున తనవంతు సాయంగా జనసేన అధ్యక్షులు ఆదుకుంటున్నారన్నారు. చేతనైతే ఈ మూడు వేల మందికి ప్రభుత్వం ప్రకటించిన ఏడు లక్షల రూపాయలు ఇచ్చి మాట్లాడండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కిషోర్ గునుకుల, దుగ్గిశెట్టి సుజయ్ బాబు, కొట్టే వెంకటేశ్వర్లు, కోలా విజయలక్ష్మి , శ్రీనివాసుల రెడ్డి, మల్లి కిరణ్, అనిల్, నాయకులు హరి, రమేష్, వరకుమార్, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com