చిత్తూరు ( జనస్వరం ) : పాల సముద్రం మండలం, వన దుర్గాపురం పంచాయతీలో జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెలమ రాజు ఇండ్లు గ్రామంలో నీటి ట్యాంక్ ను శుభ్రం చేయకపోవడం వలన ఆరోగ్య పరమైన సమస్యలతో బాధపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మనీరు తో ఊపిరి పోసుకున్న బిడ్డలకు ఉప్పు నీరు తాగిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెలమరాజు ఇండ్లు ఊరి పేరును ఎగువ వనదుర్గపురముగా మార్చాలని అధికారులకు, పాలక పక్ష నేతలకు విజ్ఞప్తి చేశారు. స్వేచ్ఛా వాతావరణంలో బ్రతుకుతున్న ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా, అశాంతి వాతావరణాన్ని కల్పించకుండా, ఇబ్బందులు లేని పరిస్థితులను ఏర్పాటు చేయవలసిందిగా తెలియజేశారు. బహు సమస్యలతో సతమతమవుతున్న దుర్గాపురం ప్రజలను ఆదుకోవాలని తెలిపారు. చెలమ రాజు ఇండ్లు వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న ముళ్ళ పొదలతో కూడిన విద్యుత్ స్తంభాలను తొలగించి, భవిష్యత్తు పిల్లలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరారు. చెలమరాజు ఇండ్ల నుండి పాల సముద్రం మండలకేంద్రం వరకు దాదాపు ఆరు కిలోమీటర్లు తారు రోడ్డు వేయాలని విజ్ఞప్తి చేశారు. గొల్ల ఇండ్ల నుండి రాజుల ఇండ్ల వరకు కల్వర్టు, మరియు రోడ్డువేయాలని, ప్రస్తుతం అది పతనావస్థలో ఉందని తెలిపారు. వన దుర్గాపురం ఆది ఆంధ్ర వాడలో నీటి ట్యాంకులను శుభ్రం చేయక పోవడంతో, నిత్యం నీరు వృధాగా పోతున్నదని తెలిపారు. రెవిన్యూ సమస్యలు పేరుకు పోయి ఉన్నదని, జిల్లా కలెక్టర్ ఉన్నత స్థాయి విచారణ కమిటీని నియమించి, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేని పరిష్కారం చూప వలసిందిగాకోరారు. ఈ కార్యక్రమంలో పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, ఉపాధ్యక్షులు నవీన్, ప్రధాన కార్యదర్శి శరవణ, కార్యదర్శి ఆకాష్, జనసైనికులు పాల్గొన్నారు.