శింగనమల, (జనస్వరం) : అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలోని వాసవి కల్యాణ మండపంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి బొమ్మన పురుషోత్తం రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్, జిల్లా ఉపాధ్యక్షులు పెండ్యాల హరి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు సంజీవ రాయుడు, చొప్పా చంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శి కిరణ్ కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్ లు మాట్లాడుతూ శింగనమల నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు అయినప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంగా ఉందన్నారు. గార్లదిన్నె నుండి నియోజకవర్గ కేంద్రానికి రావాలంటే రోడ్డు దుస్థితి అధ్వానంగా ఉందని ఇంకా గ్రామాలకు వెళ్ళే రోడ్లు ఏవిధంగా ఉంటాయో అర్థం అవుతుందన్నారు. మండల స్థాయి అధికారుల చేతుల్లో అధికారం లేకుండా చేసి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. వైసిపి నాయకులు అధికార దాహంతో సొమ్మును కూడగట్టుకునే యత్నాలు చేస్తున్నారని, ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలు గుప్పించి అధికారం వచ్చిన తర్వాత రైతులకు స్ప్రింక్లర్లు, డ్రిప్పులు పైపులు ఇవ్వకుండా రైతులను దగా చేస్తున్నారన్నారు. ప్రతి జన సైనికుడు క్రియాశీలక సభ్యుడుగా నమోదు చేసుకోవాలని, ప్రతి కార్యకర్తకు భరోసా ఉండాలని 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను సీఎంగా చేయాలన్నదే ద్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో భూకబ్జాలు, దోపిడిలు, దౌర్జన్యాలు, అరాచకాలు ఎక్కడా చేయలేదని కష్టపడి సినిమాలు తీస్తూ సంపాదించి పార్టీ కోసం కార్యకర్తల కోసం ఖర్చు చేస్తున్నారన్నారు. దీన్ని చూసి అధికార ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక పోతున్నాయని, జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి చూపిస్తామన్నారు. అనంతరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి యువకులకు కండువాలు కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీకాంత్ రెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి మురళీకృష్ణ, నియోజకవర్గ మండల అధ్యక్షలు, కార్యదర్శులు, శింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు, నాయకులు దండు హరి, మధు, సాయి కుమార్, సంతోష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com