● అధికారులు ప్రజల్లోకి రావాలని జనసేన డిమాండ్
● ప్రజా సమస్యలపై బలమైన పోరాటాలకు సిద్ధం
● గోనెగండ్లలో జనంలోకి – జనసేన
ఎమ్మిగనూరు, (జనస్వరం) : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న పాలకులకు మాత్రం కనిపించడం లేదని జనసేన పార్టీ ప్రజలకు అండగా నిలిచి బలమైన పోరాటాలు చేయుటకు సిద్ధం కావాలని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ పిలుపు మేరకు మండల కేంద్రమైన గోనెగండ్లలో జనసేన నాయకులు గానిగ బాషా, ఖాసీం సాహెబ్, మాలిక్, ఆధ్వర్యంలో సోమవారం జనంలోకి జనసేన కార్యక్రమన్ని నిర్వహించారు. గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయితీలో నిధుల కొరత కారణంతో ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదని ప్రజలకు త్రాగునీటి కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని, ప్రధాన విధుల్లో వర్షపునీరు నిలిచి చిత్తడి చిత్తడిగా మారి కాలినడకన వెళ్లలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయని పాలకులు ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సమస్యలపై స్పందించని పాలకులు ప్రజా ఆగ్రహానికి గురికాక ముందే సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు. విడతల వారిగా జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లి సమస్యలను గుర్తించి ప్రజలకు న్యాయం చేయాలని కోరినా కనీసం అటువైపు సమస్యలను చూసి ప్రజలకు ఎటువంటి హామీ ఇవ్వడానికి కూడా ముందుకు రాని పదవులు ఎందుకని ప్రశ్నించారు. అధికారుల తీరుకు నిరసనగా వారిని నిద్రలేపే కార్యక్రమాన్ని ఉదృతంగా చేయుటకు సిద్ధంగా ఉన్నామని బలమైన మార్పు యువతతోనే సాధ్యమని రాజకీయాల్లో ప్రజాసేవా కోసమని ప్రజలను మభ్యపెట్టి రాజకీయ ఉద్యోగాలు చేసే నాయకులను గట్టిగా బుద్ది చెప్పడానికి యువత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు. దేశానికి పట్టు కొమ్మలైన పల్లెల్లో అభివృద్ధి జాడ లేదని గ్రామీణాప్రాంత ప్రజలు ఎదుర్కుంటున్నా సమస్యల సాధన కోసం జనసేన చేస్తున్న పోరాటంలో యువత భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాబాష, షఫీ, దూద్ పిరా, అలీ బాషా, మధు, బడేసావలి, సాధిక్, ఖాజా హుస్సేన్, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.