నెల్లూరు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ లోని రోడ్ల అధ్వాన పరిస్థితులను ప్రజలకు తెలియజేస్తూ, శాంతియుతంగా నిరసన తెలిపిన నెల్లూరు జనసేన నాయకుల మీద ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండిస్తూ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి సూచనలతో జనసేన నెల్లూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు చదలవాడ రాజేష్ గారితో కలిసి నవాబు పేట స్టేషన్ కి వెళ్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల గారు మాట్లాడుతూ ప్రజల కోసం ఏ చిన్న కార్యక్రమం తలపెట్టినా, వారి మీద కోవిడ్ నిబంధనలు ఉల్లంఘనలు అని అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇటివల జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు పూర్తిగా దెబ్బ తిన్న రోడ్లును వెంటనే ప్రభుత్వం మరమ్మతులు చేయించాలని శాంతియుతంగా నిరసన తెలిపిన మాపై అక్రమ కేసులు బనాయించారు. అధికార పార్టీ రాజకీయ సభలు, జయంతులు, వర్థంతులకు అడ్డంకులేమీ లేవు. మేము ప్రజా సమస్యలపై శాంతియుతంగా పోరాడితే మాత్రం కోవిడ్ పేరుతో కేసులా? ఈ నిరసనలో స్వయంగా అక్కడ ఉన్న స్థానికులు స్వతహాగా వాళ్ళ సమస్యలపై మాట్లాడటానికి వచ్చారని అన్నారు. అలాగే జనసేన నెల్లూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు చదలవాడ రాజేష్ గారు మాట్లాడుతూ ప్రజల కోసం పోరాటం చేస్తున్న జనసైనికులపై అక్రమ కేసులు పెడుతుంటే చూస్తూ ఊరుకోనని, ఈ సమస్య పరిష్కారం అయ్యేవరకు వాళ్ళతో తోడుగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు చదలవాడ రాజేష్ గారు, నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల గారు, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు సుధీర్ బద్దిపూడి గారు, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ గారు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com