జనసేనపార్టీ ఆదుకున్న రైతులు కౌలు రైతులు కాదని నిరూపిస్తారా? ఎమ్మిగనూరు ఇంఛార్జ్ రేఖగౌడ్

     ఎమ్మిగనూరు, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను గుర్తించి ఒక్కో రైతు కుటుంబానికి 1 లక్ష రూపాయలు చేయూత అందిస్తూన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం వారు రైతులే కాదని చెప్పడం హాస్యాస్పదంగా వుందని వారు కౌలు రైతులు కాదని నిరూపించే దమ్ము ఉందా అని జనసేన పార్టీ ఎమ్మిగనూరు ఇంచార్జి రేఖగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రోజు మండల కేంద్రమైన గోనెగండ్ల పరిధిలోని అల్వాల గ్రామంలో టీమ్ పిడికిలి పోస్టర్లు విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ రాసి ఇచ్చే స్క్రిప్ట్ లు చదివే మీరా విమర్శించేది మా అధినేతను అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులకు కౌలు రైతులకు వ్యత్యాసం తెలియకుండా మాట్లాడే ముందు పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఉంటాయా కౌలు రైతులకు ఉంటాయా తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని అన్నారు. కౌలు రైతులకు భరోసా ఇస్తు అండగా నిలబడుతున్న అధినేత మీద నిందలు వేయడం సరికాదన్నారు. సొంత నిధులు వెచ్చించి సహాయం చేస్తున్న జనసేన అధినేతకు అధికారంలో ఉన్న రైతులను పట్టించుకోని మీకు చాలా వ్యత్యాసం వుందన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎందరో కౌలు రైతులు పండిన పంటలకు గిట్టుబాటు ధరలు అందక చేతికి వచ్చిన పంటలు అకాల వర్షాలతో దెబ్బతిని చేసుకున్న అప్పులు తీర్చుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారని అధికారంలోకి వచ్చినా వెంటనే కౌలు రైతులను గుర్తించి ఆదుకుంటామని చెప్పిన మీకు వారి ఆకలి కేకలు వారి ఆత్మహత్యలు కనిపించలేదా అని ప్రశ్నించారు. పాదయాత్రలో మీరు చెప్పిన పదానికి అర్థం ఏమిటో ప్రజలకు తెలిసిందని మీరు చూడలేదు మీకు కనపడలేదు, వినపడలేదు కాబట్టే వారి బాధలు విన్న అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు మనోధైర్యాన్ని నింపుతూ వారికి అండగా నిలబడుతుంటే ఓర్వలేని రాజకీయలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ మీడియా ఇంచార్జి గానిగ బాషా, అల్వాల మునిస్వామి, జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రామంజి నేయులు, హనుమంతు, మాబాష, రవి కుమార్, అలిబాష, గబ్బర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way