
విజయనగరం జిల్లాలో కరోనా బాధితుల సంఖ్యలు, కరోనాతో చనిపోయిన వారి సంఖ్యలు నివేదికలో తప్పుగా ఇస్తున్నారని, దీనిమీద ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు పట్టించుకోరా అని జనసేనపార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు దుయ్యబట్టారు. విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మన జిల్లాలోనే అత్యల్ప కరోన కేసులు, మరణాలు ఉన్నాయని లెక్కలు చెప్పే జిల్లా యంత్రాంగం ఒక్కసారి ప్రభుత్వ ప్రయివేటు హాస్పిటల్స్ కి, స్మశాన వాటికలకు వెళ్తే లెక్కలు బాగా తెలుస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి దగ్గర, జిల్లా మంత్రిల దగ్గర మహార్భినీల కోసం జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ తప్పుడు లెక్కలు పైకి పంపిస్తున్నారని వాస్తవానికి రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే విజయనగరం జిల్లాలోనే అత్యధిక కోవిడ్ మరణాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. హాస్పిటల్స్ లో బెడ్స్ కొరత, అక్షిజన్ కొరత అధికంగా ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకుండా జిల్లా కలెక్టర్ నీళ్లు నములుతున్నారని అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే జిల్లాలో కరోనా కేసులు, కరోనా మరణాలు ఇంకా ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం విజయనగరం జిల్లాను ప్రేత్యేకంగా పరిగణనలోకి తీసుకుని ఈ ప్రమాద పరిస్థితులనుండి ప్రజలను రక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జనసేనపార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
బ్లాక్ ఫంగస్ వచ్చిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన బొలియశెట్టి శ్రీకాంత్
ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి కరోనా కిట్లు అందించి మాకినీడి యువసేన – జనసేన
జనసైనికుడికి ఘన నివాళులు అర్పించిన ఎమ్మిగనూరు జనసేన నాయకులు
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here