- రోడ్డు విస్తరణ పేరుతో తొలగించిన "పాకిస్థాన్ దుకాణాల" స్థానంలో ఫుడ్ కోర్టు ఏర్పాటా..?
- నిత్యం రద్దీగా ఉండే చోట అవసరమా..?
- తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి
- లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదు
- విజయవాడ 47వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు వేంపల్లి గౌరీ శంకర్
విజయవాడ, (జనస్వరం) : స్థానిక పశ్చిమ నియోజకవర్గం 54 డివిజన్ గణపతి రావు రోడ్డులో ఫుడ్ కోర్ట్ ఏర్పాటుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. తక్షణమే ఆ పనులు ఆపకపోతే పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని 47వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు వేంపల్లి గౌరీ శంకర్ అన్నారు. గత ప్రభుత్వ హయాంల్ అక్కడ రోడ్డు మీద పడే ట్రాఫిక్ ఇబ్బందుల చూసి రిస్కు తీసుకొని పాకిస్థాన్ దుకాణాలను తొలగించి రోడ్డును విస్తరించారు. ఇప్పుడు మళ్లీ అక్కడే ఫుడ్ కోర్ట్ పెట్టాలని స్థానిక వైసీపీ కార్పొరేటర్, మేయర్, ఎమ్మెల్యేలు వారి స్వార్థం కోసం వీళ్లు అక్రమ సంపాదన కోసం గవర్నమెంట్ అధికారంతో పనులు చకాచకా జరిపిస్తున్నారు. ఆ పక్కనే అతి తక్కువ దూరంలో ఉన్న రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి వచ్చే ఆడపిల్లలు, పాఠశాల విద్యార్థులు, ప్రయాణికులు ఎంతోమంది కుటుంబంతో ఇదే దారిలో వెళ్లాలి. అసలే పశ్చిమ నియోజకవర్గ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లేడు బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ తరుణంలో ఈ ఫుడ్ కోర్ట్ గాని పెడితే వన్ టౌన్ ప్రజలకి రక్షణ కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి పనులు ఆపించకపోతే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com