
విజయనగరం, (జనస్వరం) : ప్రజాసమస్యలపైన, ప్రజల ఆరోగ్యంపైన మున్సిపల్ కార్పోరేషన్ వారికి ఇంత నిర్లక్ష్యమా అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం నియోజకవర్గం ఇంఛార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి గారు మున్సిపాలిటీ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం రెండో డివిజన్ పరిధిలోని కొత్తపేట నీళ్ళ ట్యాంక్ వద్ద హ్యాపీ బార్ ఎదురు కాలనీలో ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే జనసేన సభ్యత్వ శిబిరాన్ని పెట్టి, పార్టీ సభ్యత్వాలు కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండో డివిజన్ ప్రజలంతా మౌలిక సదుపాయాలైన మంచినీటి కుళాయిలు లేవని, కాలువల పూడికతీత లేదని, కొందరు వస్తున్న పెన్షన్లు తీసివేశారని వాపోయారని అన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, కాలువలు పూడికతీత పనులు చేయకుండా, పారిశుధ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కనీసం గత ఆరునెలలగా కాలువల్లో బ్లీచింగ్ కూడా చల్లట్లేదని, ప్రజలందరూ సీజనల్ వ్యాధుల బారిన పడుతూ డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలతో బాధపడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకుండా ఉండడాన్ని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ప్రజల తరుపున జనసేన పార్టీ పోరాడుతోందని ప్రజలపట్ల మున్సిపల్ కార్పోరేషన్ వారు నిర్లక్ష్య వైఖిరి విడనాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఝాన్సీ వీరమహిళ శ్రీమతి ముదిలి సర్వమంగల గారు, జనసేన పార్టీ నాయకులు త్యాడ రామకృష్ణారావు (బాలు), జనసేన మైనారిటీ నాయకులు హుస్సేన్ ఖాన్, నాయకులు తాతపూడి రామకృష్ణ మాష్టారు, కిలారి ప్రసాద్, గేదెల సాయి కుమార్, దుర్గేష్, జి.పవన్ సాయి, భవాని, హాబీద్, రఘు, తదితరులు పాల్గొన్నారు.