నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో గల నర్సీపట్నం మున్సిపాలిటీ 13వ వార్డు పెద్ద బొడ్డేపల్లి రామాలయంకు దగ్గరగా ఉన్నటువంటి బ్రాహ్మణ చెరువుకు వెళ్లే కాలువ పూర్తిగా ఆక్రమణకు గురి అవడమే కాకుండా మట్టితో కూరుకుపోయి ఉన్నదని నర్సీపట్నం నియోజకవర్గ ఇంచార్జ్ రాజన్న వీర సూర్య చంద్ర గారు అన్నారు. అంతేకాకుండా చెత్తా చెదారంతో నిండిపోయి అక్కడ ఉన్న స్థానిక ప్రజలు 13 వ వార్డు ఇంచార్జ్ గూడెపు తాతబాబు దృష్టికి తీసుకొని రాగా ఈ విషయంపై వెంటనే స్పందించి ఆ ప్రదేశంలో సందర్శించారు. స్థానిక ప్రజలు ఈ సమస్య చాన్నాళ్ళ నుంచి ఉందని దీనివలన ఇంట్లో నుండి వచ్చినటువంటి డ్రైనేజీలో ప్రవహించే నీరు ప్రవాహం ఎప్పుడూ జరగడం లేదని అది ఎందువల్ల అంటే ఎక్కడికక్కడ ఆక్రమణకు గురైందని వీటి పై స్పందించే నాధుడే కరువయ్యాడు అని అన్నారు. అంతేకాకుండా బ్రాహ్మణ చెరువుకు ప్రధాన కాలువ అని ఇటువంటి ప్రధాన కాల్వను పూడిక తీయించకుండా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోయారు. కాలువలో మురికి నీరు పేరుకొనిపోయి దోమల ఉత్పత్తి మరియు దుర్గంధం పేరుకు పోయి ఉంటుందని అక్కడ నివసిస్తున్న ప్రజలు చెబుతున్నారు. వీటిపై తక్షణమే సంబంధిత అధికారులు మరియు పాలక పక్షం వారు దృష్టిపెట్టి ఈ సమస్యను త్వరితగతిన పూర్తిచేయాలని లేనిపక్షంలో ఈ సమస్య గురించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్ అధ్యక్షుడు అద్దేపల్లి గణేష్, నర్సీపట్నం రూరల్ అధ్యక్షుడు ఊడి చక్రవర్తి, గూడెపు తాతబాబు, బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షుడు నేతల బుచ్చిరాజు చల్లా సతీష్ తదితరులు పాల్గొన్నారు.