
పరీక్షల పేరుతో పదవ తరగతి మరియు ఇంటర్ విద్యార్థుల జీవితాన్ని బలి పెట్టొద్దు అని ప్రభుత్వాన్ని రైల్వే కోడూరు జనసేన పార్టీ యువ నాయకులు అంకిపల్లి అఖిల్ కోరడం జరిగింది. అసలే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మన రాష్ట్రంలో రోజుకి దాదాపు 20వేల పైన కరోనా కేసులు అలాగే వందల సంఖ్యలో మరణాలు చూస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితిలో కరోనా సోకిన వారికి ఆసుపత్రులలో సరైన ఆక్సిజన్ లేక చనిపోయిన వారిని కనీసం దహనసంస్కారాలు చేయడానికి కూడా స్మశానంలో తావు లేని అటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు ఉంటే ఈ ప్రభుత్వానికి మాత్రం ఎంతసేపు పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి అనే కోణం పైనే ఉన్నారు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం ఇంకనైనా మీ పంతం వదిలి పరీక్షలు ఆపాలని కోరుకుంటూ పసిపిల్లల్లో విద్యార్థులను వారి తల్లిదండ్రులను కరోనాకు గురి కాకుండా వారిని కాపాడాలని కోరుకుంటున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా 2 వే దాదాపు 18 ఏళ్లలోపు వారి పై 20% చూపిస్తుండగా, వారికి కూడా చాలా కష్టంగా వైద్య సదుపాయం అందుతోంది. అందువలన పరిస్థితులను అర్థం చేసుకుని పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పై తరగతిలకి వేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.