Logo
Date of Publish : 11 February 2021, 4:47 pm
Editor : Sake Naresh

ఉక్కు ప్రవేటీకరణ ద్వారా ఆంధ్రుల ఆత్మభిమానాన్ని దెబ్బతీయొద్దు : జనసేన నాయకులు

                        ఉక్కు ప్రవేటీకరణకు కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ గాజువాక ఇంచార్జ్ & PAC సభ్యులు కోన తాతారావు గారి ఆధ్వర్యంలో ఉక్కు BC GATE ముఖద్వారం వద్ద నిరసన సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తమ్మిరెడ్డి శివ శంకర్ గారు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోరాట స్పూర్తితో పరిశ్రమను పరిరక్షించుకోటానికి ముందుకు సాగాలని, దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రవైట్ రంగంలో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ లలో సొంతగనులు లేని ఏకైక స్టీల్ ప్లాంట్ ఇదేనని, ఐరన్ఒర్, కోల్ వంటి ముడి పదార్ధాలను బయట మార్కెట్లలో కొనుక్కోవటం వలన నష్టాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో సొంతగనులు కేటాయించి ప్రభుత్వ రంగంలో నడపవలసిందిపోయి నష్టాల పేరుతో ప్రవేటీకరణ చేయటం, ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నడి బజారులో అమ్మేస్తాం అంటే జనసేన చూస్తూ ఊరుకోదు అని అన్నారు. ఈ ఉద్యమాన్ని మా పార్టీ తరుపున PAC సభ్యులు& నియోజకవర్గం ఇంచార్జ్ కోన తాతారావు గారు పూర్తిస్థాయిలో ముందుండి నడిపిస్తారు అని అన్నారు. అధ్యక్షత వహించిన కోన తాతారావు గారు మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమను స్థాపిస్తామంటే 64 గ్రామాల ప్రజలు 23, 792ఎకరాల భూమిని త్యాగం చేసి ఉపాధి కోసం నిర్వాసితులు ఎదురు చూస్తున్న తరుణంలో ప్రవేటీకరణ చేస్తామనీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిర్వాసితుల హృదయాలు కలచివేస్తున్నాయి అని అన్నారు. 4 దశాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికి 45% మంది నిర్వాసితులకు ఉపాధి దొరికింది, మిగతా వారి భవిషత్తు ప్రశ్నార్థకం అతుందని, ప్రభుత్వ రంగంలో ప్లాంట్ విస్తరణ జరిగితే తప్ప .. ఈ కర్మాగారం పైన ఆధారపడిన 1,50,000 కుటుంబాలు భవిష్యతు రోడ్డు పాలు అవుతుందని అన్నారు.. CM జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖలు రాసి ప్రజలని మభ్యపెట్టడం మానేసి, చిత్తశుద్ధితో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో కేంద్రంపై ఒత్తిడి తేవటం ద్వారా మీ భాద్యతను నిర్వర్తించండి. లేకపోతే ఈ ప్లాంట్ రావటానికి ఆనాడు 65 మంది వారి శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం గుర్తు తెచ్చుకొని మీరు కూడా రాజీనామా చేయలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com