పలమనేరు ( జనస్వరం ) : వి.కోట మండలం వైఎస్ఆర్సిపి పార్టీ నుండి జనసేనపార్టీ లోకి భారీగా చేరికలు జరిగాయి. జిల్లా కార్యదర్శి మరియు యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు పూల చైతన్య మోహన్ మరియు మండల అధ్యక్షుడు ఏ వీ బాబు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జాయిన్ అయ్యారు. చిత్తూరు జనసేన పార్టీ ఆఫీస్ నందు డీకే చైతన్య ఆదికేశవులు సమక్షంలో వీ కోట మండలం చెందిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కె రెడ్డి భాస్కర్ (పొట్టు భాస్కర్), మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కుప్పు స్వామి నాయుడు, మహిళలు ఉష, సుశీలమ్మ, డి రాజేంద్ర, మహేష్, రామ్మూర్తి, వినాయక, విజయ్, వినోద్, జునోజ్, మరియు నియోజకవర్గంలో తదితర కార్యకర్తలు 50 మంది జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయిలో కష్టపడి పార్టీని అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. డీకే చైతన్య ఆదికేశవులు మాట్లాడుతూ ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా ఉంటానని, జనసేన పార్టీ అందుబాటులో ఉంటుందని అన్నారు. జనసేనపార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com