బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గ జనసేనపార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్ లో రాష్ట్రంలో దివ్యాంగుల సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్న దివ్యాంగుల సమస్యలను పరిష్కరించలేదు. ఇంత వరకు దివ్యాంగులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని, మార్చి ఏడో తారీఖు నాడు అసెంబ్లీ సమావేశంలో దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అసెంబ్లీలో అమలుపరచాలని అన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.
1 జనసేన పార్టీ గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ నామన శివ నారాయణ మాట్లాడుతూ దివ్యాంగుల 2016 హక్కుల చట్టాన్ని అసెంబ్లీలో అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేయడమైనది.
2 ఏపీ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ దివ్యాంగులకు పెళ్లి కానుక ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.
3 జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ మార్చి ఏడో తారీఖు నాడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో దివ్యాంగుల కూడా ఉచిత కరెంటు జీవోని అమలు చేయాలి.
4 కర్లపాలెం మండల దివ్యాంగుల అధ్యక్షుడు శ్రీ కంది వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలతో పాటు దివ్యాంగులు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి.
5 కొక్కి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ చదువుకున్న దివ్యాంగులు అందరకు ఉద్యోగాలు కల్పించాలి. ఉద్యోగాలు కల్పించిన ఎడల వ్యాపారం చేసుకుంటున్న దివ్యాంగులకు 10 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలి.
ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘాల నాయకుడు విమర్శకి మురళీకృష్ణ, దేవరెడ్డి శ్రీనివాసరావు, షేక్ సుభాని, కే. కోటేశ్వరరావు, తుంగ పాటి కృష్ణ, తాడిశెట్టి శ్రీనివాసరావు, కాగా రామారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.