
బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికులు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు, వయోవృద్ధులు, హిజ్రాలు, వీరికి సంబందించిన సంక్షేమ శాఖలను జిల్లాల విభజన పేరుతో శిశు సంక్షేమ శాఖలో విలీనం చేయటానికి జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని తెలిపారు. ఈ ప్రయత్నాన్ని వెంటనే విరమించుకొని దివ్యాంగుల సంక్షేమ శాఖలను యొక్క పాత విధానాన్ని అమలు చేయాలని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, ఇమ్మడిశెట్టి మురళి కృష్ణ, గంటా నాగమల్లేశ్వరరావు, షేక్ సుభాని, వీర్రాజు, కుంట సూరయ్య తదితరులు పాల్గొన్నారు.