
పెనుకొండ, (జనస్వరం) : అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గములో గోరంట్ల మండలం కొండాపురం జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన కదిరమ్మ, ఈశ్వర్ ఇళ్లపై వైస్సార్సీపీ పార్టీకి చెందిన రౌడీ మూకలు అర్ధరాత్రి 12 గంటల సమయంలో రాళ్ల దాడులు చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి వారి దగ్గరకు వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన నాయకులు పైన గాని కార్యకర్తల పైన గాని అహంకార ధోరణితో దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం అవసరమైతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని అన్నారు.మీ ఒంటి మీద దెబ్బ పడితే మా ఒంటి మీద దెబ్బ పడినట్లే అని భరోసా కల్పించి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి వైసీపీ రౌడీమూకలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని, పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం జనసైనికులు మనో ధైర్యాన్ని నింపి భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, అనంతపురం జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు మురళీకృష్ణ, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్, కార్యదర్శి సురేష్, డాక్టర్ తిరుపతియేంద్ర, వెంకటేష్, రంగరాజు, అనిల్ పుట్టపర్తి నియోజకవర్గం మరియు గోరంట్ల మండలం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.