అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు టి.సి.వరుణ్ ఆదేశాల మేరకు జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఫుడ్ పాయిజన్ అయిన సింగనమల కేజీబీవీ (KGBV) విద్యార్థినిలకు అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్లో జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి ముప్పూరి క్రిష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ శింగనమల మండల కేంద్రములోని కస్తూరిభాయి స్కూలు నందు పుడ్ పాయిజన్ గురై దాదాపుగా 84 మంది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతుండడంతో వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. వారిలో కొంతమందిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి, పావని హాస్పిటలకు తరలించిన విషయం తెలుసుకొని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య నగరంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి, పావని హాస్పిటల్ నందు చాలా ఇబ్బంది పడుతున్న వారిని సందర్శించి పరామర్శించడం జరిగింది. అనంతరం పావని హాస్పిటల్ లో ఉన్న 9 మంది విద్యార్థినులకు ప్రభుత్వమే వైద్యసేవలు సమకూర్చాలని DMHO వినతిపత్రం అందచేయడం జరిగింది. అనంతరం DMHO Dr.యుగంధర్ తో కలిసి పావని హాస్పిటల్ లో ఉన్న విద్యార్థులను పావని హాస్పిటల్ MD Dr.గుత్తా రవీంద్ర పర్యవేక్షణలో వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ముప్పూరి కృష్ణ, జనసేన నాయకులు సిర్రప్పాగారి భాస్కర్, అజయ్ కుమార్, నవీన్ కుమార్, గిరీష్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.