
దర్శి, (జనస్వరం) : ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి పుట్టినరోజు సందర్భంగా దర్శి ప్రభుత్వ హాస్పిటల్ లోని రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి జనసేన పార్టీ నాయకులు షేక్ ఇర్షాద్, ఆకుల జగదీష్, వరికూటి అనిల్, ఓబులాపురం కొండ, ఓబులాపురం సత్య, మారెడ్డి పవన్, నీలిశెట్టి సురేష్, నీలిశెట్టి ప్రభు కుమార్ తదితరులు పాల్గొన్నారు.