Search
Close this search box.
Search
Close this search box.

జిల్లా కలెక్టర్ ఎం.వి.శేషగిరి బాబు బదిలీ అధికార పార్టీ రాజకీయ కుట్రలో భాగంగానే జరిగింది.

జిల్లా కలెక్టర్ ఎం.వి.శేషగిరి బాబు బదిలీ అధికార పార్టీ రాజకీయ కుట్రలో భాగంగానే జరిగింది. 

నెల్లూరు ( జనస్వరం) : ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాలో కలెక్టర్లుగా, జిల్లా అధికారులుగా పనిచేసేందుకు గతంలో ఉత్సాహంగా అధికారులు ముందుకు వచ్చేవారని కానీ నేడు ఆ అధికారులు అధికార వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల అక్రమాలు, వారు పెడుతున్న ఒత్తిడిని తట్టుకోలేని విధంగా తయారయ్యారని దుయ్యబట్టారు. జిల్లాలో నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకుంటూ కరోనా సమయంలో రాష్ట్రంలోనే లేని విధంగా మొట్టమొదటిగా స్పందించి నెల్లూరులో మాల్స్, సినిమా హాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్ లు మూపించి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే ఆదర్శంగా నిలిచిన జిల్లా కలెక్టర్ మిరియాల వెంకట శేషగిరిబాబుని బదిలీ చేయించడం వెనుక అధికార పార్టీ నాయకుల కుట్ర ఉందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ గా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూ మునిసిపల్ కార్పొరేషన్ లో అవినీతి జరగకుండా చర్యలు చేపట్టడం మొదలుపెట్టారో ఆనాటి నుండి ఆయన మంత్రి, ఎమ్మెల్యేలకు టార్గెట్ గా మారారని తెలిపారు. నెల్లూరు నగరం వెంకటేశ్వరపురం, అక్కచెరువుపాడు ప్రాంతాలలో పేదలకు ఇళ్ల పట్టాల కోసం సేకరిస్తున్న భూముల వ్యవహారంలో గ్రావెల్ తవ్వకాలలో కూడా అధికార పార్టీ వారు అక్రమాలకు పాల్పడుతూ ఉండడంతో వే బిల్లుల మీద సంతకాలు పెట్టనని కలెక్టర్ తెల్పిన వ్యవహారంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోపగించుకున్న విషయం మనకు మాధ్యమాల ద్వారా తెల్సిన విషయమేనని అన్నారు. నెల్లూరు మినీ బైపాస్ రోడ్డుకి రిపేర్ విషయంలో జరుగుతున్న అవకతవకలను కూడా కలెక్టర్ ప్రశ్నిస్తే మంత్రి నొచ్చుకున్న విషయం తెలిసిందేనని అన్నారు. మునిసిపల్ కార్పొరేషన్ ఎస్.ఈ ఇమాముద్దీన్ ని బిల్లుల పై సంతకాలు పెట్టమని మంత్రి ఒత్తిడి తెస్తే సెలవుపై వెళ్లిన వ్యవహారం కూడా మనకు తెలిసిందే అని అన్నారు. ఇమాముద్దీన్ సెలవుపై మంత్రి కలెక్టర్ ను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేసారని తెలిపారు. జిల్లాలో మంత్రులు అధికారులపై ఎలాంటి ఒత్తిడిని తీసుకొస్తున్నారో సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించడం మనకు తెలిసిందే అని అన్నారు. జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో భోజనం నాసిరకంగా ఉందని, మంత్రి అనిల్ బంధువే కాంట్రాక్టర్ అని తెలిసి కూడా కలెక్టర్ శేషగిరిబాబు కాంట్రాక్టర్ ను తొలగించడంతో మంత్రి మరింతగా టార్గెట్ చేయడం మొదలెట్టారని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా భూసేకరణ కు తీసుకుంటున్న అసైన్డ్ భూములు కావచ్చు, ప్రైవేట్ భూములకు ఇస్తున్న పరిహారం విషయంలో కావచ్చు అనేక అవకతవకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్పడుతున్నారని, ఒక్క మన జిల్లాలోనే 500 కోట్ల మేరకు స్కామ్ జరుగుతుందని తెలిపారు. నూతన కలెక్టర్ చక్రధర్ బాబు, జేసీ వినోద్ కుమార్ అక్రమాలను అరికట్టకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు పెట్టమన్న దగ్గరల్లా సంతకాలు పెడితే ఆనాడు వైఎస్సార్ హయాంలో ఐఏఎస్ లు ఇబ్బందులు పడి జైలుకి ఎలా వెళ్ళారో అలాంటి పరిస్థితులే రావచ్చని ఈ అధికార పార్టీ వారితో జాగ్రత్తగా ఉండాలని కేతంరెడ్డి సూచించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అక్రమాలకు సహకరించడం లేదని జిల్లా కలెక్టర్ నే టార్గెట్ చేసి మరీ బదిలీ చేయించారంటే ఈ వైసీపీ ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆత్మకూరు ఇన్ ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, సూళ్లూరుపేట ఇన్ ఛార్జ్ ప్రవీణ్, నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, గుణుకుల కిషోర్, కాకు మురళీ రెడ్డి, జనసేన బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way