Logo
Date of Publish : 10 June 2026, 2:20 pm
Editor : Sake Naresh

ఉచిత కృత్రిమ చేతుల (Prosthetic Hands) పంపిణీ ప్రాజెక్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా.

*ఉచిత కృత్రిమ చేతుల (Prosthetic Hands) పంపిణీ ప్రాజెక్ట్ పోస్టర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా.

నరసరావుపేట,జూన్ 10( జనస్వరం)

రోటరీ ఇంటర్నేషనల్, LN-4 మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వికలాంగుల కోసం చేపట్టబోయే ఉచిత కృత్రిమ చేతుల పంపిణీ ప్రాజెక్ట్ (Prosthetic Hand Project) గోడ పత్రికను (పోస్టర్) జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా  కలెక్టరేట్ నందు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదాల వల్ల లేదా పుట్టుకతో చేతులు లేని వారికి ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప వరమని కొనియాడారు. "ఆశను అందిస్తూ, ఆత్మగౌరవాన్ని పునరుద్ధరిస్తూ."  (Providing Hope, Restoring Dignity) అనే నినాదంతో రెడ్ క్రాస్ మరియు రోటరీ సంస్థలు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ ఉచిత కృత్రిమ చేతులు కావలసిన వారు లేదా ఇతర వివరాల కోసం పోస్టర్‌పై ఉన్న సంప్రదింపు నంబర్ *8866 306 969* ను సంప్రదించవచ్చని  తెలిపారు. ఈ సమాచారాన్ని అర్హులైన పేద ప్రజలకు చేరేలా  సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ మేదరమెట్ల రామ శేషగిరిరావు, వైస్ చైర్మన్ కె ఎం ఎన్ వి శ్రీనివాస గుప్తా, కోశాధికారి డాక్టర్ నంద్యాల రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com