పెందుర్తి ( జనస్వరం ) : నరవ గ్రామంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో శ్రీకాకుళం రణస్థలంలో ఏర్పాటుచేసిన యువశక్తి భారీ బహిరంగ సభకు స్థానిక నాయకులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులను ఆహ్వానించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ కార్యదర్శి యువశక్తి ప్రచారకర్త అమ్మిశెట్టి వాసు గారు పాల్గొని విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేసి తప్పకుండా ఈ నెల 12వ తారీఖున అధ్యక్షుల పవన్ కళ్యాణ్ గారు నిస్వార్ధంగా యువత కోసం, ఉత్తరాంధ్ర వెనుకబాటు కోసం, యువత ఆలోచనలుకి పెద్దపీట వేస్తూ, భవిష్యత్తులో యువతకి ఎటువంటి సమాజం కావాలి వారికి అవకాశాలు మెరుగుపడ్డానికి ప్రభుత్వాలు ఎటువంటి వెసులుబాటు కల్పించాలి అనే విషయాలపై యువశక్తి అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములై జయప్రదం చేయవలసిందిగా కోరడం జరిగింది. స్థానిక నాయకులు శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ఈరోజు ప్రభుత్వ వైఫల్యాలు వలన మీరు చదువుకున్న చదువుకి సమాజంలో మీరు చేయవలసిన ఉద్యోగానికి సంబంధం లేకుండా పోయిందని, ఇది ముమ్మాటికి పాలక నాయకులు చేసిన ప్రభుత్వ పాలసీల వలన, యువతని చిన్న చూపుతో చూడడం వలన, యువత నిస్పృహతో జీవనం సాగిస్తున్నారు. మీలో ఉన్న శక్తిని తట్టి లేపడానికి శ్రీ స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా వారి స్ఫూర్తిని యువతకు నింపడానికి పవన్ కళ్యాణ్ గారు 12వ తారీఖున రణస్థలంలో యువశక్తి అనే భారీ బహిరంగ సభలో యువతని భాగస్వామ్యం చేసే విధంగా కార్యచరణ చేసి, యువత ఆలోచనలు తీసుకొని రేపు రానున్న ప్రభుత్వాలు ఏ విధంగా యువతకి పెద్దపీట వేయాలి. యువత ఎదుగుదలకు ఎటువంటి పాలసీలు తీసుకోవాలి వీటన్నిటిపై యువత ద్వారా యువత కోసం యువత భవిష్యత్తు కోసం సభ ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మనందరం పనిచేయాలని కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు సన్యాసినాయుడు, గవర శ్రీను, బొడ్డు నాయుడు, బొబ్బర శ్రీను, ప్రవీణ్, తేజ, రామ ప్రసాద్, మరియు జనసైనికులు విద్యార్థులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com