
గుంటూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు జన్మదిన సందర్భంగా అరమళ్ళ సుజిత్ గారి ఆధ్వర్యంలో బాపట్ల స్థానిక గవర్నమెంట్ హాస్పటల్ లో గర్భిణీ వార్డులో పాలు, బ్రెడ్, పండ్లు, పంపిణీ చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ గాదె వెంకటేశ్వరరావు గారు నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కార దిశగా పోరాటం చేస్తుంటారు. జనసేనాని సూచనల మేరకు జిల్లా అధ్యక్షుడిగా జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఆయన సారథ్యంలో జిల్లాలో పటిష్టమైన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని చేపడతామని అన్నారు. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఊస ప్రసాద్ గారు, కొట్రా మణికంఠ, కార్తీక్, తిరుమల రావు తదితర జనసైనికులు పాల్గొన్నారు.