
కార్వేటి నగర్ ( జనస్వరం ) : కార్వేటి నగరం గ్రామ పంచాయతీ, శుద్ధగుంట గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కాయగూరలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న హాజరైనారు. ఈ సందర్భంగా డాక్టర్ యుగంధర్ మాట్లాడుతూ సమస్యల్లో ఉన్న ప్రజలకు అండగా జనసేన ఉంటుందని తెలిపారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవ ఆగదని, పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడవడమే శిరోదార్యమణి తెలియజేసారు. గత మూడు రోజులుగా కురిసిన వర్షం వల్ల ఇబ్బంది పడ్డ అరవై ఆరు కుటుంబాలకు కాయగూరలు పంపిణి చేసారు. జనసేన సేవకే గాని సంపాదనకు కాదని తెలిపారు. పవన్ కళ్యాణ్ కి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, శుద్ధగుంట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఈ గ్రామంలో వర్షాలకు ఇబ్బంది పడని పరిస్థితిని తీసుకురావాలని అధికారులకు తెలిపారు. కార్వేటినగరం మండల ప్రజలకు మొదటి విడతలోనే యాభై గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు శోభన్ బాబు, మండల ఉపాధ్యక్షులు విజయ్, సురేష్ రెడ్డి, టౌన్ కమిటీ ప్రెసిడెంట్ రాజేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ,మండల ప్రధాన కార్యదర్శులు నరేష్, వెంకటేష్, బూత్ కన్వీనర్ అన్నామలై, జనసైనికులు, గ్రామస్తులు ఉన్నారు.