Logo
Date of Publish : 02 October 2023, 8:30 pm
Editor : Sake Naresh

జనసేన పార్టీ నాయుకులు కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లుకు యూనిఫారంపంపిణీ

       విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయుకులు కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లుకు యూనిఫారం పంపిణి చేశారు. అల్లిపురం నేరెళ్ల కోనేరు వద్ద నున్న కందుల నాగరాజు నివాసంలో జరిగిన కార్యక్రమానికి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి శివశంకర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా శివ శంకర్ మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్బంగా 500 మందికి యూనిఫామ్ పంపిణి కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు. దేశానికి అహింసా, గాంధీ ఈ దేశానికి అహింసా, సత్యాగ్రహ, శాసన ఉల్లాంఘన, సహాయ నిరాకరణ ఆయుధాలను దేశానికి అందించారన్నారు. ఈ ఆయుధాలతో ఏ దురాగతాన్ని ఎదుర్కో వచ్చున్నన్నారు. జనసేన కు పట్టం కట్టాలని ప్రజలు ఎదురు చూస్తున్నరన్నారు వారహి లో పవన్ కళ్యాణ్ సందించిన ప్రశ్నలకు వైసిపీ నేతలు సమాధానం చెప్పలేక పిచ్చి ప్రేలపణలు చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం జనసేన ద్యేయం అన్నారు. జనసేన నాయుకులు కందుల నాగరాజు మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు దుర్భర పరిస్థితులను ఎదుర్కో తున్నారని చెప్పారు. వైసిపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లును నిలువు దోపిడీ చేస్తుందన్నారు. రాష్ట్ర దిశ,దశ మారాలంటే అది జనసేనతోనే సాధ్యం అన్నారు. జనసేన కార్యకర్తలకు 5 లక్షలు బీమా చేసిన పార్టీ జనసేన అని వివరించారు.సొంత నిధులతో సంక్షేమం చేసే ఏకైక నేత పవన్ కళ్యాణ్ అని చెప్పారు ఈ కార్యక్రమంలో జనసేన నాయుకులు శివప్రసాద్ రెడ్డి, కందుల బద్రి, కందుల కేదార్, గరికిన రవి, తెలుగు అర్జున్, తెలుగు లక్ష్మి, శ్రావణి, రఘు, త్రినాధ్, నరేష్, లుక్స్ గణేష్, దుర్గా, కుమారి, జానకి, శర్వాణి , రూపా, నరేంద్ర, అంగటి త్రినాద్, అప్పారావు, లలిత, ప్రణిత, అనిల్, భూలక్ష్మి గాజుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com