అనంతపురం ( జనస్వరం ) : కొర్రపాడులో ఉన్న అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల నందు ముక్కోటి అంబిక సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కిట్స్ అందించారు. ట్రస్టీ లావణ్య మాధురి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో యువతకు విద్యతో పాటు క్రీడా స్ఫూర్తి కూడా ముఖ్యమన్నారు. చాలా మంది మహిళలు అన్ని రంగాల్లో తమదైన శైలిలో రాణిస్తున్నారన్నారు. క్రీడా రంగంలో మహిళలు మరింత మంది ఎదగాలని, ఆ దిశగా ప్రతి ఒక్క అమ్మాయి అడుగులు వేయాలని కోరారు. ట్రస్ట్ చైర్మైన్ మరియు శింగనమల నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు దంపేట్ల శివ మాట్లాడుతూ నేడు మహిళా రంగం ఎందులో కూడా తక్కువ కాదని నిరూపిస్తూ నారీమణులు తమదైన శైలీలో ప్రతిభను వెలికితీయడం అభినందనీయం. క్రీడల్లో మరింత రాణించి దేశం గర్వపడే స్థాయికి ఎదగాలని కోరారు. వారి క్రీడా ఎదుగుదలకు మేము అందించే కిట్స్ ఉపయోగపడాలని కోరుకుంటున్నామని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ ముక్కోటి అంబిక సేవా ట్రస్ట్ ద్వారా క్రీడా కిట్స్ అందించడం చాలా సంతోషమన్నారు. పిల్లల క్రీడా భవిష్యత్తుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో PET గౌతమి, ట్రస్ట్ కో- ఆర్డినేటర్ రామాంజనేయులు, హ్యాండ్ బాల్ జిల్లా సెక్రటరీ శివశంకర్, కాపుసేన ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు దివాకర్, కాపుసేన జిల్లా ప్రధాన కార్యదర్శి తోట ప్రకాశ్, AISB జిల్లా ప్రదాన కార్యదర్శి పృద్వి, DSU రాష్ట్ర అధ్యక్షుడు మారుతి, ట్రస్ట్ వాలంటీర్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ల
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com