విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్న దేవీ నవరాత్రులు ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేయనున్న అన్న సంతర్పణ కార్యక్రమానికి వివిధ దేవి నవరాత్రులు కమిటీల నిర్వాహకులకు దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి నియోజకవర్గంలో చాలా చోట్ల దుర్గా దేవి సంబరాలు నిర్వహించారని చెప్పారు. చాలా దుర్గాదేవి పందిళ్లకు తన కుటుంబ సమేతంగా వెళ్లి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కూడా చెప్పారు. ఆ అమ్మవారి ఆశీస్సులు నియోజవర్గ ప్రజలందరికీ ఉండాలని అలాగే అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు తెలియజేశారు. వివిధ దుర్గాదేవి కమిటీలు భక్తుల కోసం నిర్వహించే అన్న సంతర్పణ కార్యక్రమాలకు బియ్యం బస్తాలు ఆయిల్ డబ్బాలను పంపిణీ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com