
కర్నాటక ( జనస్వరం ) : అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘo తరుపున విడుదలైన భీమ్లా నాయక్ చిత్రం సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కర్నాటక పవన్ కళ్యాణ్ అభిమానులు మాట్లాడుతూ సిడ్లఘట్ట నియోజకవర్గం కమిటీ తరపు నుంచి పేద వాళ్లకు రేషన్ కిడ్స్ అందించడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే మాకు పండుగలా ఉంటుందని, అయితే పేదవాళ్ళ ఇంట్లో కూడా పండుగ జరపాలని సరుకులు పంచామని తెలిపారు. ఈ సహాయానికి స్పందించిన అందరికీ సిడ్లఘట్ట కమిటీ తరుపున ధన్యవాదాలు తెలిపారు.