
మంగళగిరి, (జనస్వరం) : ఈరోజు మంగళగిరి బాపనయ్య నగర్ 28 వార్డులో చిల్లపల్లి యూత్ ఆధ్వర్యంలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ & మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ భారతదేశం లౌకిక దేశమని, సర్వ మతాలను గౌరవించడం జనసేన పార్టీ సిద్ధాంతం అని, అలాగే ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తుందని, జనసేనపార్టీ అధికారంలోకి రావడంతోనే ముస్లింల సాధికారత సాధ్యపడుతుందని తెలియజేశారు. తదనంతరం రంజాన్ తోఫా ముస్లిం కుటుంబాలకు అందజేసి పవిత్ర రంజాన్ అందరికీ సంతోషాన్ని, ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరఫున ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం మహిళలు వారి సమస్యలను తెలియపరచగా కచ్చితంగా పెన్షన్, రేషన్ కార్డులు వచ్చేలాగా జనసేనపార్టీ మీ తరఫున ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతుందని వారికి హామీ ఇచ్చారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన చిల్లపల్లి యూత్ సభ్యులు షేక్ వజీర్ భాష, నందం మోహన్ రావు, మేకల సాయి, మేకల చంద్ర, జొన్నాదుల పవన్ కుమార్, సభ్యులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు. తదనంతరం చిలపల్లి యూత్ టీషర్ట్ ను ఆవిష్కరించి యూత్ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, mtmc కోఆర్డినేటర్ మునగపాటి వెంకటమారుతి రావు, పార్టీ ఐటీ విభాగం సభ్యులు చవ్వాకుల కోటేష్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు షేక్ కైరల్లా, మంగళగిరి మండల అధ్యక్షులు వాస శ్రీనివాసరావు, దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షుడు సామల నాగేశ్వరరావు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.