
అనంతపురం ( జనస్వరం ) : నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో టి.సి.వరుణ్ గారి ఆధ్వర్యంలో క్రియాశీలక కార్యకర్తలకు సభ్యత్వ కిట్లను పంపిణీ చేసి అత్యధికంగా సభ్యత్వలు చేసినటువంటి రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి మరియు వాలంటీర్లను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ గారు మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండగా నిలిచే పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సభ్యులకు ఏదైనా జరిగితే ఆర్థికంగా అండగా ఉండేలా రూపొందించిందే క్రియాశీలక సభ్యత్వం అని అన్నారు. గడచిన రెండేళ్ళలో ప్రమాదానికి గురైన కార్యకర్తలకు 50వేల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు 5 ₹లక్షల రూపాయలు అందిస్తూ పార్టీ తోడుగా నిలవడం జరిగిందన్నారు. పార్టీ సభ్యులకు ఏ కష్టం వచ్చినా తోడుగా నిలవాలని, కార్యకర్తల ఇంట్లో కుటుంబసభ్యునిగా మమేకం అవ్వాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిత్యం తమకు చెప్తుంటారని వివరించారు. నగరంలోని ప్రతి కార్యకర్త సంక్షేమానికి తోడుగా ఉంటున్నామని, సమస్యలు ఏర్పడినపుడు అండగా నిలుస్తామని, అక్రమ కేసులు బనాయిస్తే పోలీసు స్టేషన్ల ఎదుట పోరాడిన సందర్భాలు ఉన్నాయని, కోర్టులో న్యాయ పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయని కొన్ని ఉదాహరణలను కార్యకర్తలకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే ఆ రోజులు ఎంతో దూరంలో లేవని, మనవంతుగా మనం ఆ దిశగా ప్రజల వైపు, ప్రజా సమస్యల పరిష్కారం వైపు బలంగా నిలబడితే చాలు అని కార్యకర్తలకు సూచించారు. రానున్న మంచి రోజుల్ని దృష్టిలో పెట్టుకుని ఉరకలెత్తే ఉత్సాహంతో ప్రతి ఒక్కరం పని చేద్దాం అని జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ గారు కార్యకర్తలకు తెలిపారు.