Search
Close this search box.
Search
Close this search box.

క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ కిట్స్ పంపిణీ

   పాలకొండ ( జనస్వరం )  : పాలకొండ  నియోజకవర్గం జనసేన పార్టీ ఆఫీస్ లో క్రియాశీలక సభ్యత్వ కిట్లను అందజేయడం జరిగింది. ఈ మేరకు గర్భాన సత్తిబాబు గారు మాట్లాడుతూ… “ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను మరియు పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలను ప్రజల వద్దకు వెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి”* అని ఆయన చెప్పారు. అదేవిధంగా పార్టీ బలోపేతానికి ప్రాణాలు పణంగా పెట్టి కృషి చేసే కార్యకర్తలకు ఆకస్మిక మరణం జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా వారి కుటుంబానికి ఇన్స్యూరెన్స్ అందించి భరోసా కల్పిస్తుంది ఈ ‘క్రియాశీలక సభ్యత్వం’. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 5 లక్షల రూపాయల భీమా కుటుంబ సభ్యులకు అందించి ఆదుకుంటారు ఏదైనా ప్రమాదం జరిగితే 50000/- ఆరోగ్య భీమా అందిస్తారు. జనసైనికులు, వీరమహిళలు మన క్షేమం కాంక్షించే జనసేనాని ఆలోచనను అందుకొని ఆ దిశగా అడుగులు వేయాలని ప్రియమైన జన సైన్యం కోసం “క్రియాశీలక సభ్యత్వం”. ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారు ప్రజల్లోకి వెళ్లి జనసేన పార్టీ ఆశయాలు,సిద్దాంతాలు వివరిస్తూ జనసేన పార్టీ బలోపేతానికి మీ వంతు భాధ్యత నిర్వహించాలి అని *రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు హక్కును వేసి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా తెలియచేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way