మర్రిపాడుమండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసైనికులకు మాస్కులు పంపిణీ
నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు కోట్టె వెంకటేశ్వర్లు గారు అందించిన 50 మాస్కులను అనంతసాగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు మహబూబ్ మస్తాన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని మర్రిపాడు మండల జనసైనికులకు అందజేశారు. మస్తాన్ గారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా జనసేన నాయకులు మాస్కులు అందించిన కోట్టె వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచిన ఉదయ్, గంటా, అంజి, చిన్నా జనసేన కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిన్నా జనసేన ప్రచారకార్యదర్శి, ఉదయ్ గంటా, అంజి తదితరులు పాల్గొన్నారు.