Logo
Date of Publish : 04 August 2021, 4:49 pm
Editor : Sake Naresh

నెల్లూరునగరం జనసేనపార్టీ క్రియాశీలక సభ్యులకు కిట్స్ పంపిణీ

        నెల్లూరు నగరం, (జనస్వరం) :  జనసేన జిల్లా కార్యాలయంలో నెల్లూరు సిటీలో పూర్తయిన క్రియాశీలక సభ్యత్వ కిట్స్ ను నెల్లూరు జిల్లా కమిటీ సభ్యుల సమక్షంలో క్రియశీలక సభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షులు బద్దెపూడి సుధీర్, సిటీ నాయకులు సుజయ్ బాబు మాట్లాడుతూ, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు సిటీలో దాదాపు 1100 మంది పైచిలుకుతో పూర్తి చేయటం శుభప్రదం అని, ఈ కార్యక్రమం ఇంతటి విజయం సాధించడానికి జిల్లా అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి కార్యదక్షతే కారణమనీ తెలిపారు. తన వ్యక్తిగత సంపాదన నుంచి కార్యకర్తల శ్రేయస్సు నిమిత్తం కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిదే అనీ, ఈ సభ్యత్వంతో పాటు సభ్యులకు ఇచ్చిన భీమాసౌకర్యంతో ప్రమాదం జరినపుడు, వైద్యం నిమిత్తం రూ50000లు ప్రాణహాని జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు రూ 500000 ఇస్తూ పార్టీ తరపున భరోసా కల్పిస్తున్నామని, దేశంలో మరే రాజకీయ పార్టీల్లో లేని సౌకర్యం జనసేన పార్టీ కలగజేసింది. రానున్న రోజుల్లో అన్నీ నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యత్వాలు పూర్తి చేసి బలమైన కమిటీలు ఏర్పరుచుకొని, కరోనా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజల ఆర్థిక కష్టాలను సైతంలెక్క చేయక పన్నులతో బాదుతూ పీడిస్తున్న ప్రభుత్వంతో పోరాటానికి సామాన్యుడికి అండగా నిలుస్తామనీ తెలిపారు. జిల్లా ప్రధానకార్యదర్శి గునుకుల కిషోర్, నెల్లూరు నగర నాయకులు సుజయ్ బాబు, ఉపాధ్యక్షులు, సుధీర్ బద్దిపూడి, జిల్లా ప్రధాన కార్యదర్శి, మేకల ప్రవీణ్ కుమార్ యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మున్వర్ భాష, కార్యదర్శి, పసుపర్తి కిషోర్, సంయుక్త కార్యదర్శులు, పూసల లక్ష్మిమల్లేశ్వరరావు, ప్రశాంత్ గౌడ్ లీలా మోహన్, జనసేన పార్టీ నాయకులు సుల్తాన్ బాషా, షాజహాన్, తదితర నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com