
రాజోలు ( జనస్వరం ) : రాజోలు మండలం కడలి అరవపాలెం గ్రామంలో ముక్కోటి ఏకాదశి వేడుకలో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లను దర్శించుకున్న జనసేన నాయకులు. అనంతరం అన్నసమరాధన కార్యక్రమంలో పాల్గొని, రాజోలు మండల జనసేనపార్టీ అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాస్ గారి సమక్షంలో జనసేన నాయకులు ఉలిశెట్టి లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో అరవపాలెం జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు స్టిక్కర్లను, కీచేన్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, ఎంపిపి మేడిచర్ల సత్యవాణి రాము, రాష్ట్ర కార్యదర్శి గెడ్డం మహాలక్షి ప్రసాద్, కోళ్ళ బాబీ, జనసేన నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.