
రాప్తాడు ( జనస్వరం ) : రాప్తాడు నియోజకవర్గ౦లోని రాప్తాడు మండలం, అనంతపురం రూరల్ మండలంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు చేయించుకున్న వారికి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం సూచనల మేరకు రాప్తాడులోని బ్రహ్మయ్య దేవాలయం నందు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ కోసం నిరంతరం శ్రమించే జనసైనికులకు, వీరమహిళలలకు క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ఏర్పాటు చేశారు. దీనివలన జనసేనపార్టీలో సభ్యత్వం తీసుకున్న వారిలో ఎవరైనా దురదృష్టవశాత్తు ప్రమాదాలలో మృతి చెందితే పార్టీ తరుపున వారికి రూ. 5 లక్షల సహాయం అందిస్తారని పేర్కొన్నారు. ఒకవేళ ప్రమాదాలలో ఎవరైనా గాయపడితే రూ. 50 వేల రూపాయల వరకు ఆర్ధిక సహాయం అందుతుందన్నారు. దేశంలో మొట్టమొదట సారిగా రూ. 5 లక్షలతో ప్రమాద భీమా కార్యకర్తలకు అందించడం జనసేనపార్టీకే సాధ్యమన్నారు. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని అన్నారు. ప్రతి ఒక్కరూ రాప్తాడు నియోజకవర్గంలో జనసేనపార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేనపార్టీ సిద్దాంతాలను ప్రతి ఇంటికి బలంగా తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. రాప్తాడు నియోజకవర్గంలో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. 11 వ తేదీన ఆత్మకూరు, కనగానపల్లి, 12 వ తేదీన రామగిరి చెన్నేకొత్తపల్లి మండలాల్లో ఘనవిజయంగా జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ చేయడానికి సన్నాహాలు చేశామన్నారు. అత్యధిక క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించిన సాకే నరేష్ ను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. అలాగే కళ్యాణ్ గారు పంపిన ప్రశంసాపత్రాన్ని అందించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించిన ఎర్రిసామిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి నారాయణ స్వామి, జిల్లా ప్రచార కార్యదర్శులు రమణ, మధు, వెంకటేష్, రాప్తాడు మండల అధ్యక్షుడు మహేశ్, అనంతపురం రూరల్ మండల అధ్యక్షుడు రామాంజినేయులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.