పామిడి ( జనస్వరం ) : మండల జనసేన అధ్యక్షులు ధనుంజయ మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబానికి భరోసాగా ఉండేందుకు కార్యకర్తల కుటుంబ క్షేమం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ఆశయంతో మొదలుపెట్టినదే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమామని అన్నారు. జనసేన పార్టీ కార్యకర్తలు 500 రూపాయల ప్రమాద బీమా తో ప్రమాదవశాత్తు అనుకోని ప్రమాదం జరిగి మరణం సంభవిస్తే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందించే విధంగా ముందు చూపుతో ఆలోచించి మొదలుపెట్టిన గొప్ప కార్యక్రమమాని అన్నారు. అలాగే రానున్న రోజుల్లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకుని ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి శిరసా వహిస్తూ గుంతకల్లు నియోజకవర్గం లో గెలుపు కోసం మా వంతు బలంగా ముందుకు వెళ్తామన్నారు. ధైర్యంగా పోరాడుతామని, ప్రశ్నించే వారిపై దాడులు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ, పోలీసుల చేత అరెస్టులు చేయిస్తూ, ప్రతిపక్ష నాయకుల కార్యకర్తల గొంతు నొక్కాలని చూస్తున్నటువంటి ఈ రౌడీ రాజ్యాన్ని, నిరంకుశ నాయకుడిని ఓడించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని అన్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారని, ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో నాయకుడు తీసుకున్న నిర్ణయం కచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల క్షేమం కోసం, భావితరాల పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని కచ్చితంగా ఈ రౌడీ రాజ్యాన్ని దోపిడీ ప్రభుత్వాన్ని ఈ నిరంకుశ నాయకున్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి రంగానికి సంబంధించిన ప్రజలు విసిగి పోయారని ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు. కనీసం కూలి పనులు చేసుకునే పరిస్థితి కూడా నేడు ఆంధ్ర రాష్ట్రంలో లేదని మొత్తం ఉన్న వాటిని దోచేసుకునే విధంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఇలాంటివి పరిస్థితులలో కచ్చితంగా జనసేన తెలుగుదేశం కలిసి ముందుకు వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పామిడి మండల నాయకులు, ఖాజావలి, సూర్య ప్రకాష్, రాయల్ రమేష్, భాస్కర్ గౌడ్, మాబు, పారా సురేష్, విజయ్ కుమార్, మురళి, సాయికుమార్, గంగాధర్ గౌడ్, శరత్ కుమార్, సల్మాన్, పూర్ణాధర్ రావ్, బోయ రామాంజనేయులు, శ్రీకాంత్, హయత్, ఆన్సర్ ఖాన్, సాయి, శేక్ష, అఫ్జల్, రాజేష్ కుమార్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com