ఎమ్మిగనూరు, (జనస్వరం) : జనసేన పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం చేసిన క్రియాశీలక సభ్యత్వాలను మండల కేంద్రమైన గోనెగండ్లలో బుధవారం రోజు రాష్ట్ర మహిళ సాధికారిక ఛైర్మన్, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కుల మతాలకు అతీతంగా నిరంతరం శ్రమించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తమ కార్యకర్తల సంక్షేమం కోసం దేశంలో ఏ పార్టీ సాహసించని విధంగా కార్యకర్తల కోసం క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించి, ప్రమాదం సంభవించి మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు తక్షణమే 5 లక్షల భీమా పరిహారం అందించేలా కృషిచేస్తున్నారని, కార్యకర్తల కోసం ఆలోచించే ఏకైక పార్టీ జనసేనపార్టీ అని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం పరితపించే నాయకులు అరుదుగా ఉండే రోజుల్లో ఎక్కడ ప్రజా సమస్యలు ఉత్పన్నమైతే అక్కడ పవన్ కళ్యాణ్ వస్తేనే పరిష్కారం లభిస్తుంది అనే గొప్ప ఆలోచన ప్రజల్లో వుందని జనసేన యువకేరటలు అధినేత స్ఫూర్తిని ఆశయాలను సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లి రాబోయే రోజుల్లో జనసేన సత్తా చాటేల ప్రతి క్రియాశీలక కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గానిగ బాషా, ఖాసీం సాహెబ్, రామంజి నేయులు, షఫీ, మాబాష, రవికుమార్, అక్బర్, మునిస్వామి, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.