రాప్తాడు ( జనస్వరం ) : రాప్తాడు నియోజకవర్గ౦లోని చెన్నేకొత్తపల్లి మండలంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు చేయించుకున్న వారికి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం సూచనల మేరకు బసంపల్లి గ్రామం నందు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ క్రియాశీలక సభ్యులు ప్రమాదంలో మరణిస్తే 5 లక్షల వరకూ ప్రమాద భీమా, గాయపడితే 50 వేల రూపాయల వరకూ భీమా వర్తిస్తుందని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జనసేనపార్టీ గెలుపు ధ్యేయ౦గా పని చేయాలని అన్నారు. గత పాలకుల వల్ల రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం పేరుతో యువత భవిష్యత్తుని నాశనం చేశారు. యువతకు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే యువత సొంతంగా ఎదిగేలా 10లక్షల రూపాయల ప్రోత్సాహాన్ని అందిస్తూ పారిశ్రామిక విప్లవాన్ని తీసుకువస్తామని అన్నారు. అత్యధిక క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయించిన నారాయణస్వామిని అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. అలాగే కళ్యాణ్ గారు పంపిన ప్రశంసాపత్రాన్ని అందించారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుండి ముఖ్య నాయకులు అయిన బేరి శ్రీరాములు, నరెద్దుల వెంకటేశులు, చిమిరాల ఈశ్వరయ్య, బండ్ల ధను ముత్యాల వెంకటరాముడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేన పార్టీ సిద్దాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి ఇంచార్జ్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో చేరారు. వీరు మాట్లాడుతూ కళ్యాణ్ గారు రైతులకోసం చేస్తున్న కౌలు రైతు భరోసా యాత్ర నా మనస్సును కదిలించింది. పవన్ కళ్యాణ్ గారి లాంటి నిస్వార్థపరులు మన రాష్ట్రానికి సీయం అయితే అబివృద్ధి జరుగుతుందని అన్నారు. ఆ దిశగా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నేకొత్తపల్లి మండల అధ్యక్షుడు ఇటికోటి క్రాంతి కుమార్, కొత్తచెరువు మండల అధ్యక్షుడు పూల శివ ప్రసాద్, బసంపల్లి జనసైనికులు, వీరమహిళలు తదితర జనసైనికులు పాల్గొన్నారు.