Logo
Date of Publish : 03 December 2021, 3:01 pm
Editor : Sake Naresh

రాజంపేట వరద బాధితులకు ట్విట్టర్ జనసైనికుల ఆర్థిక సహాయంతో గ్యాస్, నిత్యావసర సరుకులు పంపిణీ

         రాజంపేట ( జనస్వరం ) : ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలంలోని అణగారిపల్లి, తొగురుపేట గ్రామాలు నీట మునిగి చాలా కుటుంబాలు దీనావస్థితికి చేరుకున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న ట్విట్టర్ జనసైనికులు కలసి ఆ బాధిత కుటుంబాల కోసం తక్షణ సాయంగా సహాయం చేయాలనుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు 50 కుటుంబాలకు గ్యాస్ సిలెండర్లు, బియ్యం, దుప్పట్లు తదితర నిత్యావసర సరుకులు సరుకులు అందించారు. బాధిత కుటుంబాలు మాట్లాడుతూ ఈ వరద సమయంలో మమ్మల్ని ప్రభుత్వాలు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. మా పరిస్థితి చాలా దీనావస్థికి చేరింది. ఇటువంటి సమయంలో మమ్మల్ని ఎవరైనా ఆదుకుంటే బాగుండు అనిపించింది. సమయానికి జనసైనికులు మాకోసం దాదాపుగా 2 లక్షల రూపాయల సరుకులు అందించారు. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంల్ ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని, ప్రజలకు అండగా ఉంటున్నామని అన్నారు. జనసేనాని స్పూర్తితో ట్విట్టర్ జనసైనికులు ఈ ఆర్థిక సహాయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ వరద బాధితులకు తక్షణ సాయంగా జనసేనపార్టీ ద్వారా కొంత ఉపశమనం కపించినా వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజంపేట జనసేన ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శులు తాతంశెట్టి నాగేంద్ర, ముఖరం చాంద్, కడప  ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్, రైల్వే కోడూరు జనసేన నాయకులు రెడ్డి ప్రసాద్ & టీం, చెంగారి శివప్రసాద్, కరుణాకర్ రాజు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com