
రైల్వేకోడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మర్రి రెడ్డి ప్రసాద్ పర్యవేక్షణలో విద్యాసాగర్ దాతగా పేదలకు ఆహార పోట్లాలు పంపిణీ జరిగింది. కోడూరు టౌన్లోని లక్ష్మీ ప్యారడైజ్ థియేటర్ వెనుక ఉన్న వలస కార్మికుల గుడిసెల ప్రాంగణంలో సుమారు 150 మందికి పైగా భోజనం ప్యాకెట్లను అందించడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వచ్చేటప్పుడు డబుల్ మాస్కులు ధరించాలని, ఇటువంటి తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా పనిలేకుండా బయట తిరగరాదని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరుచుకోవాలని, ఇటువంటి సమయంలో ప్రభుత్వం ప్రకటించిన సమయాల్లోనే బయటకు జాగ్రత్తలు తీసుకొని వెళ్ళిరావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చవాకుల రెడ్డి మణి, నగరి పాటి మహేష్, సింగిరి రాజ్ కుమార్, వాయిల పాటి శ్రీనివాస్, నల్ల౦సెట్టి మురళీ, మల్లెల హరి మరియు జనసేన మైనారిటీ నాయకురాలు షేక్ హలీమా పాల్గొన్నారు.