డోన్ ( జనస్వరం ) : బేతంచర్ల మండలంలోని బుగ్గనిపల్లె తాండ గ్రామంలో ఎస్. విజయ్ కుమార్ అనే వ్యక్తికి పక్షవాతం వచ్చి ప్రభుత్వం నుండి పింఛన్ అందక ఇబ్బందులు పడడం చాలా బాధాకరమని జనసేనపార్టీ తరుపున ఇచ్చిన మాట ప్రకారం మూడో నెల 2,000 రూపాయలు పింఛన్ అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా డోన్ నియోజకవర్గ నాయకులు మద్దిసెట్టి స్వామి చల్లా మాట్లాడుతూ పేదల కోసం వైసీపీ పని చేస్తుంది అని చెప్పే నాయకులు పక్షవాతంతో బాధపడుతూ కుటుంబ పోషణ భారంగా మారి ఇబ్బందులు పడుతుంటే ఎందుకు పింఛన్ మంజూరు చేయడం లేదు అన్ని ప్రభుత్వంపై మండి పడ్డారు. అతనికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎందుకని పింఛన్ అందడం లేదు. ఇలాగే మండలంలో అన్ని అర్హతలు ఉన్న ఏవో కారణాలు చూపి సుమారు 100 కి పై పింఛన్లు తొలిగించడంపై ప్రభుత్వాని ప్రశ్నించారు. 2024 జరిగే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమిని గెలిపించి వైస్సార్సీపీని గద్దె దించాలని ప్రజలను కోరారు. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిగించిన అర్హులకు పింఛన్ మంజూరు అయ్యేలా చేస్తామని జనసేన పార్టీ తరుపున హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా వట్టినేల నాగరాజు, డోన్ నియోజవర్గ వీర మహిళా చాముందేశ్వరి, మండల నాయకులు మూనీంద్ర, గురప్ప, నవీన్, రాయుడు, తదితరులు పాల్గొన్నారు.
.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com