నిడదవోలు ( జనస్వరం ) : ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలో 5 నెలలు క్రితం జనసైనికుడు మేడపాటి దుర్గాప్రసాద్ చనిపోయారు. ఆరోజు జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రియ సౌజన్య ప్రతి నెల మేడపాటి దుర్గాప్రసాద్ కుటుంబానికి కావలిసిన నిత్యావసర సరుకులు ఇస్తాను మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం 3వ నెల కూడా ఇవ్వడం జరిగింది. ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఎవరికి ఏం కష్టం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉండ్రాజవరం మండల ప్రెసిడెంట్ విరమళ్ళ బాలాజీ, నిడదవోలు A. N. R, సదా వెంకిట్ తదితర జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com