హైదరాబాద్, (జనస్వరం) : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా మియాపూర్ (హైదరాబాద్) నడిగడ్డ తాండాలో అమీర్ ఖాన్ గారి రధ సారధ్యంలో టీమ్ సైనిక జేఎస్‌పి ఇండో- ఎన్ఆర్ఐ (Hyd వింగ్ ), అజయ్ బాబు యువసేన (మాతృసంస్థ) ఆధ్వర్యంలో 200మందికి పైగా బియ్యం, నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణి చేశారు.వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తి తో ప్రజలకు నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఓయూ జేఏసి జనసేన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ నాయక్ గారు మరియు జనసేన వీర మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు రత్నా పిళ్ళ, మారిశెట్టి సతీష్ బాబు, జనసేన వీర మహిళా విభాగం నందినీ చౌదరి, సుదర్శన్, మంత్రాల పవన్, సత్తి సైదులు, షన్ను కుమార్, బాలూ నాయక్ తదితురులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com