
మంగళగిరి, (జనస్వరం) : నిడమర్రు గ్రామానికి చెందిన పత్తిపాటి పోషణ కుటుంబ పోషణకు ఇబ్బందిగా ఉన్న కారణంగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు నిడమర్రు గ్రామంలో పత్తిపాటి పోషణ నివాసానికి వెళ్లి వారి కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిల్లపల్లి యూత్ సభ్యులు కట్టె పోగు నవీన్ కుమార్, పర్వతం మధు, నందం మోహన్ రావు, హరీష్ తదితరులు పాల్గొన్నారు.