రాజోలు ( జనస్వరం ) : రాజోలు నియోజకవర్గం మెరకపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు గిడుగు సత్య బ్రహ్మాజీ కుమార్తె నీలిమ మొదటి పుట్టినరోజు సందర్భంగా రాజోలు శ్రీ వివేకానంద విజ్ఞాన మనో వికాస కేంద్రం నందు మానసిక వికలాంగులకు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి నీలిమకి శుభాకాంక్షలు తెలియజేసి అశీస్సులు అందించి బ్రహ్మాజీని అభినందించి కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మరియు రాజోలు జనసేన మండల అధ్యక్షులు సూరిసెట్టి శ్రీను, పంచదార చినబాబు గారు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com