Logo
Date of Publish : 19 February 2022, 6:34 pm
Editor : Sake Naresh

చేపల వేటకు వెళ్ళి మరణించిన బాలరెడ్డి కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ

     రంపచోడవరం ( జనస్వరం ) : నియోజకవర్గం అడ్డతీగల మండలం డొక్కపాలెం గ్రామంలో ఇటీవల మద్ది గడ్డ రిజర్వాయర్ లో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు జర్త బాలరెడ్డి అనే యువకుడు మృతిచెందాడు. వారి కుటుంబాన్ని జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి, అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు, వైరామవరం మండలం జనసేన నాయకులు డొక్క పాలెం గ్రామంలో తల్లి జర్త లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి దైర్యం చెప్పారు. జర్త లక్ష్మి గారి భర్త ఇదివరకే మరణించారు. కళ్లు కూడా కనిపించని వృధ్యాపంలో ఉన్న తండ్రిని కూడా ఆమె సాకుతూ కష్టాలు పడుతున్నారు. సుంకర కృష్ణవేణి చేతుల మీదగా జనసైనికులు 50 కేజీల బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా సుంకర కృష్ణవేణి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వాళ్లకి ఎప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిపుత్రులైన వారి కుటుంబాన్ని ఆదుకోవాలని తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. అడ్డతీగల మండలంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరు ఎటువంటి ఇబ్బంది పడిన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్డతీగల మండలం జనసేన యువ నాయకులు కుప్పాల జయరామ్, చోళ్ళ కృష్ణారెడ్డి, కర్ర నరసయ్య, వీరేంద్ర, అచ్చమ్మ నాగమణి, వైరామవరం మండలం పల్లాల కృష్ణారెడ్డి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com