పిఠాపురం ( జనస్వరం ) : ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడ గ్రామంలో పి.ఎస్.ఎన్ మూర్తి 20 పేద కుటుంబాలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేసారు. పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన నాయకులుదొడ్డి దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన అనే కార్యక్రమం లో భాగంగా 20 పేద కుటుంబానికి బియ్యం కూరగాయలు పి.ఎస్.ఎన్ మూర్తి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పి.ఎస్.ఎన్. మూర్తి మాట్లాడుతూ జనసేన తెలుగుదేశం కూటమిని మీరందరూ స్వాగతించాలని వచ్చే ఎలక్షన్లలో జనసేన తెలుగుదేశం కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించి మనమందరం కలిపి పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీను, కర్రీ కాశి, కసిరెడ్డి నాగేశ్వరరావు, పెదిరెడ్ల భీమేశ్వరరావు, ముప్పన రత్నం, కొండేవారం ఎంపీటీసీ అభ్యర్థి గింజల మహాలక్ష్మి, పెంకే జగదీష్, పాలూరి కామరాజు, నామా శ్రీకాంత్ మరియు పి.ఎస్.ఎన్. మూర్తి తదితరులు పాల్గొన్నారు.