రైల్వే కోడూరు నియోజక వర్గంలో వెంకటరెడ్డి పల్లి, కోడూరు పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేద కుటుంబంలో ఉండే ఆడ బిడ్డలకు మరియు అనాధ బాలికలకు తెలుగింటి పండుగ అయిన సంక్రాంతికి తోటి పిల్లల తో సమానం గా కొత్త బట్టలు కట్టు కోవాలని, వారికి ఆనోందత్సవాన్ని పంచాలనే ఉద్దేశంతో వస్త్రాలు అందించారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలలో ఒకటి అయిన సంసృతి సంప్రదాయాలును కాపాడటంలో భాగంగా స్థానిక జనసేన దళిత నాయకులు నగిరి పాటి మహేష్ గారు పేద పిల్లలకి వస్త్ర దానం చేయడం జరిగినది. వారు మాట్లాడుతూ సృష్టి లో కూడు, గూడు, గుడ్డ ముఖ్యమైనవి ఇవి మానవుని మౌళిక సదుపాయాలు.కావున సంక్రాంతి పండగ పూట కూడా బిడ్డలకు ఒక జత కొత్త బట్టలు ను తీసివ్వలేని స్థితిలో యిప్పటికి తెలుగు రాష్ట్రాల లో చాలామంది పేదరికం లో మగ్గుతున్నారు అని అన్నారు. వీరిని చూసినప్పుడు మనసుకి చాలా బాధ గా ఉంటుందని అందుకే ఉన్నంత లో నాకు అందుబాటు లోని పేద పిల్లలకి బట్టలు పంచాను అని తెలియజేశారు. ఈ కార్యక్రమ౦లో జనసేన నాయకులు మర్రి రెడ్డి ప్రసాద్ మరియు పలువురు జనసైనుకులు పాల్గొన్నారు.