Logo
Date of Publish : 09 August 2020, 11:24 am
Editor : Sake Naresh

లెప్రసీ కాలనీ వాసులకు వస్త్రాలు పంపిణీ : జనసేన ఎన్నారై సేవాసమితి

లెప్రసీ కాలనీ వాసులకు వస్త్రాలు పంపిణీ : జనసేన ఎన్నారై సేవాసమితి

             కడప జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలోని జ్యోతి కాలనీలోని లెప్రసీ కాలనీ వాసులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో 30 రోజులు 30 సేవా కార్యక్రమాలు లో భాగంగా ఆదివారం జనసేన ఎన్నారై సేవాసమితి కువైట్ సభ్యుడు కుప్పల భాస్కర్ రాయల్ కుమార్తె జైష్ణవి పుట్టినరోజు సందర్భంగా చీరలు, పంచెలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మర్రి రెడ్డి ప్రసాద్, అంకిపల్లి అఖిల్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో ప్రజాసేవే జనసేన లక్ష్యంగా కొనసాగుతూ ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా లెప్రసీ కాలనీ వాసులకు కుప్పల భాస్కర్ రాయల్ దాతృత్వంతో వందమందికి వస్త్రాలు పంపిణీ చేయడం జరిగిందని అలాగే లెప్రసీ కాలనీ వాసులకు గతంలో ఎన్నోసార్లు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం కూడా జరిగిందని, వారికి ఎల్లవేళలా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేసారు. పవన్ కళ్యాణ్ 30 రోజులు 30 సేవా కార్యక్రమాలు రూపొందించిన సేవా సమితి అధ్యక్షుడు రామచంద్రనాయక్ మరియు ఉపాధ్యక్షుడు పగడాల అంజన్ కుమార్, మాదాసు నరసింహ మరియు కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా రైల్వేకోడూరు జనసైనికులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా లేప్రసీ కాలనీ అధ్యక్షుడు ధనుంజయ నాయుడు మాట్లాడుతూ మాకు సహాయ సహకారాలు అందించిన జనసేన ఎన్నారై సేవాసమితి కమిటీకి మరియు రైల్వేకోడూరు జనసేన పార్టీ సభ్యులకు అలాగే ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న జైష్ణవికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు.  ఇలాగే మాకు ఎల్లవేళలా మీ సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటున్నానని తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమంలో జనసేన వీర మహిళలు సింగిరి శివమ్మ, షేక్ హలీమాభి,సౌజన్య మరియు జనసేన నాయకులు అనంత రాయల్, అంకిశెట్టి మణి, ప్రసాద్, కటికం మణి, నగిరిపాటి మహేష్, హేమంత్, బాలిశెట్టి వెంకటేష్, షాజహాన్ మరియు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com