నెల్లూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టితో చేసినటువంటి వినాయకుని విగ్రహాలు పంపిణీ
నెల్లూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టితో చేసినటువంటి వినాయకుని విగ్రహాలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో గునుకుల కిషోర్ మాట్లాడుతూ లాక్ డౌన్ కారణం గా ప్రతిఒక్కరు ఎవరకి వారు తమ తమ ఇళ్ళల్లోనే పండుగ చేసుకోవాలని పర్యావరణ పరిరక్షణక కొరకు మట్టితో చేసిన వినాయకులను పూజించుకోవాలని ఈ కరోనా కారణం గా బొజ్జ వినాయకుడు ఆరోగ్య వినాయకుడుగా మారి ప్రజలందరిని ఈ కరోనా నుంచి విముక్తి కలిగించాలని అన్నారు. ఈసారి కరోనా వైరస్ వల్ల వినాయక చవితి వేడుకలు, సంబరాలు, భజనలు, కొలాహాలం లేకపోవడం ఒక రకంగా ఎంతో బాధాకరం అయినా ఇదే ఉత్సాహం రాబోయే “వినాయక చవితి” ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఈ కరోనా మహమ్మారి సర్వనాశనం అయ్యి దేశ ప్రజలందరూ సుభిక్షంగా జీవించాలని ఆ లంబోదరుడిని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ Covid 19 నియమాలని పాటిస్తూ పండుగను జరుపుకోవాలని గునుకుల కిషోర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, పవన్, సందీప్, లక్ష్మణ్, కోటి,శశాంక్, బాలాజి,విక్రాంత్ తదితరులు పాల్గొన్నారు.